తెలంగాణ

telangana

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే

ETV Bharat / videos

Thakre on CM KCR : 'సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరగలేదు' - తెలంగాణ న్యూస్

By

Published : May 6, 2023, 7:17 PM IST

Manik Rao Thakre on CM KCR : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఉద్యోగ కల్పన జరగలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్​రావ్ ఠాక్రే ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చలేదని, యువత చాలా నిరుత్సాహంతో ఉందని ధ్వజమెత్తారు. ప్రియాంకా గాంధీ సభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో జరిగిన అన్యాయంపై మాట్లాడుతారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనలో తాము ఏం చేయబోతున్నామో ప్రియాంక గాంధీ చెబుతారన్నారు. 

ఈ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ఆమె ప్రకటిస్తారని తెలిపారు. అన్ని వర్గాల నిరుద్యోగ యువత ఈ నెల 8న సరూర్​ నగర్​లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందని, కానీ 9 ఏళ్లలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 9 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్​ పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. సరూర్​నగర్​ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details