తెలంగాణ

telangana

Congress MLA Gaddam Vivek Reacts on ED Investigation

ETV Bharat / videos

ఈడీ విచారణకు హజరైన వివేక్- రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ ఆరోపణ - ed notices to gaddam vivek

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 7:52 PM IST

Congress MLA Gaddam Vivek Reacts on ED Investigation :రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై ఈడీ రైడ్స్‌ జరిగాయని కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆరోపించారు. ఇవాళ అయన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో లభించిన 8 కోట్ల రూపాయల చెక్కు విషయంలో ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. తదుపరి విచారణకు తాను హాజరు కావలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారన్నారు. 

ED Notices to Gaddam Vivek :ఇంకా ఏమైనా పత్రాలు అడిగితే సమర్పించాలని సూచించినట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పదివేల కోట్ల పన్నులు కట్టిన వ్యక్తినని, ఫెమా నిబంధనలు అసలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై తాము చేసిన పోరాటం వల్ల పటాన్‌చెరులోని తమ కంపెనీని మూసివేయించారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి చేసిన కుట్రలుగానే దీనిని భావిస్తున్నామన్నారు. రాజకీయంలో ముందుకే వెళ్తానని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details