తెలంగాణ

telangana

Congress MLA Candidate Shabbir Ali Interview

ETV Bharat / videos

స్థానం మార్చినా - ప్రజల ఆదరణ నాపై అదే స్థాయిలో ఉంది : షబ్బీర్‌ అలీ - కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 4:57 PM IST

Congress MLA Candidate Shabbir Ali Interview :నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పోటీ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కామారెడ్డిని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి త్యాగం చేసి.. నిజామాబాద్‌కు మారారు. ఈ ప్రాంతంలో మైనార్టీలు అధికంగా ఉండటంతో కాంగ్రెస్‌కు కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. స్థానం మార్చినా.. ప్రజల ఆదరణ నాపై అదే స్థాయిలో ఉంటుందని షబ్బీర్‌అలీ విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ.. తమ పార్టీలో ఎటువంటి అసంతృప్తులు లేరని స్పష్టం చేశారు.

మైనార్టీలు ఉన్నచోట మెజారిటీ రాదని కొందరి అపోహ.. అటువంటి ఆలోచనలకు తోవలేకుండా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలే తమ ప్రధాన అస్త్రాలుగా బరిలోకి దిగుతున్నామన్నారు. గెలిచినా ఓడినా నిజామాబాద్‌ ప్రజలకు సేవ చేసేందుకు అనునిత్యం అందుబాటులో ఉంటానని అంటోన్న నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్అలీతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details