Congress Leaders Stopped KTR Convoy : మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు - Congress latest news
Congress Leaders Stopped KTR Convoy : మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన కేటీఆర్‌ను.. కాంగ్రెస్ నాయకులు, కొందరు విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకునేందు ప్రయత్నించారు. కామారెడ్డి పర్యటన అనంతరం.. ఎల్లారెడ్డి వెళ్తున్న క్రమంలో దేవునిపల్లి దేవివిహార్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్ రాగానే.. ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు, యువకులు ఎదురుగా దూసుకెళ్లారు. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. కొందరిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ పర్యటన సందర్బంగా గత అర్ధరాత్రి నుంచే కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అయినప్పటికి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో మంత్రి కాన్వాయ్ సుమారు 10నిమిషాల పాటు ఆగిపోయింది. అనంతరం మిగతా కార్యక్రమాలు సజావుగా సాగాయి.