'మా ప్రభుత్వం మేమే పంచుతాం' - ఆరు గ్యారంటీల ఫామ్లను ఎత్తుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు - Six guarantees Form issue
Published : Dec 28, 2023, 3:55 PM IST
Congress Leaders Stole Six Guarantees Forms in Mahabubnagar : ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు పంచాయతీ కార్యదర్శి పంచుతుండగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాటిని ఎత్తుకెళ్లిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మీర్జా అలీ బేగ్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించిన ఆరు పథకాల అప్లికేషన్లు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులు వాటిని ఎత్తుకెళ్లారు.
ఇది తమ ప్రభుత్వం దరఖాస్తు పత్రాలు తామే పంచుతామని, గ్రామంలో దీని గురించి ఎలాంటి చాటింపు లేకుండా అప్లికేషన్లు ఎలా పంచుతున్నారని గొడవకు దిగారు. తమకు ఎవరు ఓటు వేశారో, వేయలేదో తమకే తెలుసని, గ్రామ కార్యదర్శి నుంచి అప్లికేషన్ ఫామ్లు చోరీ చెేశారు. అక్కడికి చేరుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎస్సై వెంకటేష్ పరిస్థితిని చక్కదిద్దారు.