Congress Leaders Protests Aganist BJP : 'రావణ్'గా రాహుల్‌గాంధీ పోస్ట్‌పై కాంగ్రెస్ నిరసనలు.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం - టీ కాంగ్రెస్
Published : Oct 7, 2023, 7:46 PM IST
Congress Leaders Protests Aganist BJP : బీజేపీ ట్విటర్ హ్యండిల్లో.. రాహుల్‌గాంధీ ఫోటోను రావణుడిగా పోల్చుతూ పోస్ట్ చేసినందుకు హైదరాబాద్‌లో కాంగ్రెస్శ్రేణులు నిరసనలు చేపట్టారు. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
BJP Posts Rahul as Ravana in Twitter :గాంధీభవన్కుపెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట వాగ్వాదం చోటుచేసుకుంది. గాంధీభవన్ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు.. గాంధీభవన్ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ జోడోయాత్రతో రాహూల్ గాంధీపై ప్రజలలో పెరిగిన ఆదరణను ఓర్వలేక ఇటువంటి పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధేనని స్పష్టం చేశారు.