Congress leaders protest : 'వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే' - Assembly meetings
Congress leaders tried to besiege Telangana Assembly : వరద బాధితుల సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి. ఈ రోజు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో వరద బాధితులకు న్యాయం చేయాలని శాసనసభ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి 20 లక్షలు పరిహారం ప్రకటించాలని నిరసన తెలిపారు. శాసనసభ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేత సాయికుమార్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పన సహా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ ఎన్ఎస్యూఐ అసెంబ్లీ మట్టడికి యత్నించింది. బోధన, భోదనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి, క్రమబద్దికరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీ మట్టడికి యత్నించింన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.