హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలపై సొంత మేనిఫెస్టో రూపొందించా : పొన్నం ప్రభాకర్ - పొన్నం ప్రభాకర్ తాజా ఇంటర్వ్యూ
Published : Nov 21, 2023, 1:21 PM IST
Congress Leader Ponnam Prabhakar Interview : హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అడుగు పెట్టని గ్రామాలెన్నో ఉన్నాయని.. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఎన్నో సమస్యలు చెబుతున్నారని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది పనులు చేశానని గర్వంగా చెప్పగలుగుతానని తెలిపారు.కానీ గత తొమ్మిదేళ్లుగా హుస్నాబాద్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని మండిపడ్డారు. తాను గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలపై సొంత మేనిఫెస్టో రూపొందించానని వెల్లడించారు.
Ponnam Prabhakar Fires On BRS :హుస్నాబాద్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ నాయకులు.. కేవలం ఓట్ల కోసమే ఉపయోగించుకున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాను గెలిస్తే విద్యా, టూరిజంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్.. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను ఇంకా పూర్తి చేయలేదన్న పొన్నం.. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పెరిగిందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పొన్నం ప్రభాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.