తెలంగాణ

telangana

Jeevanreddy

ETV Bharat / videos

Jeevan Reddy on BRS Govt schemes : "దళితబంధు, బీసీబంధు పథకం లబ్దిదారులపై శ్వేతపత్రం విడుదల చేయాలి" - KCR

By

Published : Jul 24, 2023, 4:29 PM IST

Jeevan Reddy on Minority bandhu : ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడులేరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను.. ఎస్సీ ఎస్టీ డెవలప్‌మెంట్‌గా మార్చారని ఆక్షేపించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ బంధు ఇస్తున్నామని జీవో జారీ చేసిన.. గడిచిన ఐదేళ్లుగా మైనారిటీ యాక్షన్‌ ప్లాన్ ఏమైందని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితబంధు, బీసీబంధు పథకం ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కిషన్​రెడ్డి అంటున్నారని.. ముస్లిం మైనార్టీల్లో సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరు అలయ్‌ బలయ్‌ తీసుకుంటూనే.. కేంద్రం సహకరించడంలేదని కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేంద్రం సహకరించకపోతే 2020 వరకు మోదీకి ఎందుకు మద్దతు తెలిపారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతిబిల్లును కేసీఆర్ సమర్థించారని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details