Congress Leader Mallu Ravi on Ponnala Issue : పొన్నాల కాంగ్రెస్‌వైపే ఉండాలని కోరుకుంటున్నాం : మల్లు రవి - తెలంగాణ తాజా వార్తలు
Published : Oct 14, 2023, 6:14 PM IST
Congress Leader Mallu Ravi on Ponnala Issue :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌వైపే ఉండాలని కోరుకుంటున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మొన్నటి దాకా తిట్టి.. బీఆర్ఎస్లోకి పొన్నాల వెళ్లడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో చూస్తే బీఆర్ఎస్ నాయకులు, దాని డీఎన్ఏను దూషించిన వారిలో మొదటిస్థానంలో పొన్నాల ఉంటారని అన్నారు.
Congress Senior Leader Ponnala Resign Issue : ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగిని ప్రవళిక ఇంటికి వెళ్లి ఓదార్చే సమయం కేటీఆర్‌కు లేదు కానీ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల ఇంటికి వెళ్లడానికి మాత్రం సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీ అయిన ఈటల రాజేందర్‌పై కుట్ర చేసి హింస పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్‌కు లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా వివరించారు.