హెలికాప్టర్ ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక సమస్య - ఇల్లందులో దిగకుండానే వెళ్లిపోయిన రేవంత్ - కాంగ్రెస్ పార్టీ ప్రచారం 2023
Published : Nov 27, 2023, 7:23 PM IST
Congress Election Campaign at Yellandu :బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలతో రెండు పర్యాయాలు పరిపాలించిందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి.. ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాలని పిలుపునిచ్చారు.
ఇల్లందులో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లందు నియోజకవర్గ రోడ్‌షోలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననుండగా.. హెలికాప్టర్ ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆయన హాజరు కాలేకపోయారు.