ఎన్నికల సంఘానికి మంత్రి పువ్వాడపై ఫిర్యాదు చేసిన తుమ్మల - తుమ్మల తాజా వ్యాఖ్యలు
Published : Nov 13, 2023, 6:58 PM IST
Congress Candidate Tummala Complaint to EC on Minister Ajay : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ నామపత్రాన్ని రిజెక్ట్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్క్రూటినీ సందర్భంగా ఆయన మంత్రి అజయ్‌కుమార్ ఇచ్చిన నామపత్రం కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఫార్మాట్‌లో లేదని ఆరోపించారు. స్థానిక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తే ఆయన పట్టించుకోలేదని తెలిపారు. అందుకే ఎలక్షన్ కమిషన్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దిల్లీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
అజయ్‌కుమార్ సమర్పించిన ఫార్మాట్‌లో 8 గడులకు బదులుగా 6 గడులు ఉన్నాయన్నారు.. రెండు గడుల్లో నిల్ రాయాల్సింది పోయి మొత్తం అవి లేకుండా పత్రాలు సమర్పించారన్నారు. మనం ఇష్టారీతినా నామపత్రాలు ఇస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వారి నామినేషన్‌ను రిజెక్ట్ చేస్తారని తెలిపారు. అలా సొంతంగా మార్చడానికి లేదని నిబంధనల పుస్తకంలో పొందుపరిచారన్నారు. కానీ స్థానిక రిట్నరింగ్ అధికారి దీనిని పట్టించుకోవడం లేదని తుమ్మల ఆరోపించారు.