'తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటోంది'
Published : Nov 14, 2023, 8:03 PM IST
Face to Face with Karimnagar Congress Candidate Srinivas : కరీంనగర్‌లో స్థానిక మంత్రిపై ఉన్న వ్యతిరేకతే తన గెలుపునకు కారణం అవుతుందని... కాంగ్రెస్ అభ్యర్థి పుర్మళ్ల శ్రీనివాస్ అన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టించిన స్థానిక మంత్రి... తనకు నేరచరిత్ర ఉందని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని... నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తొమ్మిదేళ్ల పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజల వెంట ఉన్నానని వారి సమస్యలు, అవసరాలు తీర్చానని తెలిపారు.
నేడు తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పుడైతే నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చకపోతే వారంతట వారే కొత్త అభ్యర్థిని ఎంచుకుంటారని అలా తనకు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ది ప్రజల కోసం కాదని... కేవలం కమీషన్ల కోసమే అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పుర్మళ్ల శ్రీనివాస్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.