Congress BRS Leaders Clash in Jadcherla : మహబూబ్‌నగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ - Congress BRS clash in Nasrullabad
Congress BRS clash in Nasrullabad Mahbubnagar :మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డి సేవ్ జడ్చర్ల పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఇవాళ ఆ పాదయాత్ర నస్రుల్లాబాద్‌కు చేరుకుంది. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో నస్రుల్లాబాద్‌లో స్మశాన వాటిక స్థలానికి సంబంధించి అనిరుద్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కూడలి సమావేశం అనంతరం పాదయాత్ర కొనసాగించారు. కాగా ఆయన చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఘర్షణలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.