తెలంగాణ

telangana

John pahad Dargah

ETV Bharat / videos

John Pahad Dargah: ఈ దేవుడి దర్శనం చాలా కాస్ట్​లీ గురూ.. దర్శనానికే రూ. 5000.! - డబ్బులు

By

Published : Apr 14, 2023, 4:25 PM IST

దాదాపు 400 ఏళ్ల విశిష్టమైన చరిత్ర కలిగిన సైదుల స్వామి దర్గాకు ఎక్కువ మొత్తంలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి వస్తారు. ముస్లింలు కంటే హిందువులే ఇక్కడ అధికశాతం తమ మొక్కులను చెల్లించుకుంటారు. సూర్యాపేట జిల్లాలో కృష్ణా నది తీరంలో జాన్​ పహాడ్​ గ్రామంలో ఈ దర్గాకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. సంతానం లేని వారు ఇక్కడకు వచ్చిన సైదులు స్వామిని దర్శించుకుంటే.. సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే ఈ దేవుడిని సంతాన దేవుడిగా అందరూ కొలుస్తారు. 

భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం చూసో ఏమో తెలియదు కాని.. అక్కడ మొక్కులు తీర్చుకునేందుకు నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏనాడు భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయని దర్గా నిర్వాహకులు.. ఇలా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

దర్గాలోని సైదులు స్వామి మొక్కు చెల్లించేందుకు రూ.700 తీసుకుంటున్నారన్నారు. అలాగే మరోచోట రూ.1100 లేకపోతే దర్గాలోని నిర్వాహకులు రానివ్వడం లేదని భక్తులు వాపోతున్నారు. దర్శనానికి వెళితే రూ.100 వసూలు చేస్తున్నారని చెప్పారు. దేవుడు దగ్గర నుంచి చూడడానికి, బయట మొక్కులు తీర్చుకోవడానికి మొత్తం కలిపి సుమారు రూ.5000లు ఖర్చు అవుతుందన్నారు. ఇన్ని జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మొత్తం చెల్లించి.. లోపలికి వెళితే నిర్వహణ సరిగా లేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  

ABOUT THE AUTHOR

...view details