తెలంగాణ

telangana

Coimbatore DCP chandeesh Exclusive interview on Jos Allukas jellowry robbery case

ETV Bharat / videos

పోలీసులనే ఆశ్చర్యపరిచిన స్పైడర్​ మెన్​ దొంగ - ఏకంగా 4 కిలోల బంగారం చోరీ - జోస్​ అలుక్కాస్​లో 4 కిలోల బంగారం చోరీ

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 7:43 PM IST

Coimbatore DCP Chandeesh Exclusive Interview :తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని 100 ఫీట్​ రోడ్డులో ఉన్న జోస్​ అలుక్కాస్​ నగల దుకాణంలో గజదొంగ 4,600 గ్రాములు బంగారం, వజ్రాలు, ప్లాటినమ్​ వంటి ఆభరణాలను దొంగలించాడని కోయంబత్తూరు నార్త్​ డిప్యూటీ కమిషనర్‌ చందీశ్​ తెలిపారు. ఈ దోపిడి ఘటనపై రత్నపురి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదై చందీశ్​ నేతృత్వంలోని ఐదు ప్రత్యేక బృందాలు జ్యూయలరీ పరిసర ప్రాంతంలోని ఉన్న 400 పైగా సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. పోలీసుల దర్యాప్తు వల్ల నేరస్థుడు ధర్మపురి జిల్లాకు చెందిన విజయ్​గా గుర్తించారు. 

Jos Allukas Jewelry Robbery Case in Coimbatore : ఇలాంటి దోపిడీల్లో ఆయన ఆరితేరిన మాయగాడని విచారణలో తేలింది. అతికష్టం మీద ఆనైమలైలోని స్నేహితుడి ఇంటి వద్ద ఉన్న అతనిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎంతో చాకచక్యంగా సినిమాల్లో చూపించిన విధంగా పారిపోయాడు. చివరికి అతని భార్యను అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి 3 కిలోల ఆభరణాలను రికవరీ చేయగా ఇంకో 800 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉంది. ఇతని కోసం చందీశ్​ టీం ప్రత్యేకంగా గాలిస్తోంది. ఈ స్పైడర్​ మెన్​ దొంగ గురించి ఆయన దోపిడీలపై పూర్తి సమాచారాన్ని కోయంబత్తూరు డీసీపీ చందీశ్​ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details