తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్​ రెడ్డి - అక్కడి కార్యకలాపాలపై ఆరా - Telangana Chief Minister Revanth Reddy

🎬 Watch Now: Feature Video

CM Revanth Reddy visit MCRHRD

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 5:32 PM IST

CM Revanth Reddy visit MCRHRDI :సీఎం రేవంత్​రెడ్డిమర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను సందర్శించారు. ఆ సంస్థ డీజీ డాక్టర్‌ శశాంకగోయల్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, తాజా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

సీఎం ఎంసీహెచ్‌ఆర్డీకి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫ్యాకల్టీ సభ్యులతో రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను డీజీ శశాంకగోయల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్‌ పవర్‌ వాహనంలో ముఖ్యమంత్రి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్దేశించుకున్న లక్ష్యాలను సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు వివరించారు. ఇందుకు తగ్గట్లుగా యంత్రాంగం కూడా పని చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్‌, వివిధ విభాగాల ఫ్యాకల్టీల సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details