CM KCR Wardhannapet Public Meeting Speech : బీఆర్ఎస్ ప్రభుత్వం.. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోంది : కేసీఆర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు
Published : Oct 27, 2023, 6:51 PM IST
CM KCR Wardhannapet Public Meeting Speech :తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు.. తనపై ఎవరికీ నమ్మకం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. కాంగ్రెస్ దిగి వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని తెలిపారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్న వారికి తెలంగాణపై అవగాహన లేదని మండిపడ్డారు. ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్లామని.. షార్ట్‌కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్ధాలు చెప్తారని దుయ్యబట్టారు. వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా రూ.160 కోట్ల నిధులతో వర్ధన్నపేటను అభివృద్ధి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పదేళ్ల క్రితం వ్యవసాయం ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 24 గంటల కరెంట్ వద్దనుకుంటేనే కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. అహంకారంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు.