నేతల మాటల యుద్ధం - 'విద్యుత్, ధరణి'లే ప్రచార అస్త్రాలు - రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆన్ కేసీఆర్
Published : Nov 8, 2023, 6:57 AM IST
CM KCR VS Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలంతా విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని మరింత రసవత్తరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్(KCR), పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వర్డ్ వార్ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.
Revanth Reddy Fires on CM KCR: విద్యుత్, ధరణి అంశాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కేంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు కరెంట్‌తో పాటు ధరణిని ఎత్తివేస్తారని విమర్శిస్తుండగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. 24 గంటల విద్యుత్‌తో పాటు ధరణి(Dharani)ని సాంకేతికంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రేవంత్ హామీ ఇస్తున్నారు. వీటితో పాటు రుణమాఫీ, రైతు బంధు.. ఇతర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలపై విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.