కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వైభవంగా ముగిసిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం - రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్
Published : Nov 3, 2023, 9:21 PM IST
CM KCR Raja Shyamala Yagam : కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేసామని స్పష్టం చేసారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.
Raja Shyamala Yagam in KCR Form House : రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాజ్య అభివృద్ధికి.. సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగం నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి స్వహస్తాలతో సాగిన రాజశ్యామలా చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరైన కేసీఆర్ దంపతులు.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.