CM KCR Election Campaign in Narayankhed : నారాయణఖేడ్ హీరో భూపాల్‌రెడ్డి.. మరోసారి గెలిపిస్తే నల్లవాగు పూర్తి చేసే బాధ్యత నాది : కేసీఆర్ - సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
Published : Oct 30, 2023, 5:34 PM IST
CM KCR Election Campaign in Narayankhed : ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాలను హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల ప్రగతిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందుగా జుక్కల్, బాన్సువాడ సభల్లో పాల్గొన్న కేసీఆర్.. చివరగా నారాయణఖేడ్ సభలో పాల్గొని ప్రసంగించారు.
నారాయణఖేడ్ హీరో భూపాల్‌రెడ్డి అని.. ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆయన అందుబాటులో ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరును లింక్ చేసుకున్నామన్న ముఖ్యమంత్రి.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే భూపాల్‌రెడ్డిని మరోసారి గెలిపిస్తే.. నల్లవాగు పూర్తి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మాసాన్‌పల్లి రోడ్డును కూడా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.