బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు - తెలంగాణలో మాత్రం నీటి పన్ను లేదు : కేసీఆర్ - డోర్నకల్ బీఆర్ఎస్ ఆశీర్వాద సభ
Published : Nov 21, 2023, 5:02 PM IST
CM KCR BRS Public Meeting at Dornakal : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం నీటి పన్నులు లేవని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొంటున్నామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
Telangana Election 2023 : కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారానని ఆరోపణలు చేస్తున్నారు.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని మండిపడ్డారు. ఈ పోర్టల్‌తో ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజల చేతిలో పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో 3500 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని.. డోర్నకల్‌లోనే 82 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ చెప్పారు.