తెలంగాణ

telangana

సీఎం కేసీఆర్​

ETV Bharat / videos

'కేసీఆర్​ బర్త్ డే' స్పెషల్.. వరంగల్​లో మరో సచివాలయం - వరంగల్​లో భారీ సెట్​

By

Published : Feb 15, 2023, 1:38 PM IST

Secretariat in Warangal :  సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. రెండు రోజులు ముందు నుంచే రాష్ట్రం గులాబిమయం అయిపోతుంది. ఎటుచూసిన గులాబి జెండానే.. అందులో కేసీఆర్​నే కనిపిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులు పోటాపోటీగా కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్నారు. 

నిజామాబాద్​, వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లో కేసీఆర్​ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే ప్రత్యేక ఆకర్షణగా మాత్రం ఓరుగల్లు జిల్లానే కనిపిస్తుంది.. ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం పుట్టినరోజు వేడుకలకు ఏకంగా ఒక సెట్టే వేస్తున్నారు. దీంతో ఆ నగరం ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదిన వేడుకలకు ఘనంగా ముస్తాబవుతున్నట్ల సంకేతాన్ని ఇచ్చింది. 

వరంగల్​ నగరంలోని అజంజాహి మైదానంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. జన్మదిన వేడుకల కోసం నూతన సచివాలయం నమూనాతో కూడిన భారీ సెట్టును ఏర్పాటు చేస్తున్నారు. జన్మదిన వేడుకలకు మంత్రులు హాజరు కానున్నారు. కొందరు సినీ ప్రముఖులు సైతం హాజరుకానున్నారు. 

ఈ పుట్టినరోజు వేడుకలు అనంతరం శివరాత్రి జాగరణ కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్​ పుట్టినరోజు వేడుకల కోసం గాను 30 లక్షలకు పైగా ఖర్చు చేయడం.. నగరవాసులలో చర్చనీ అంశంగా మారింది. అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశాలు కల్పిస్తున్న కేసీఆర్​ పుట్టినరోజున.. రక్తశిబిరాలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details