రాబోయే పాతికేళ్లలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ : కిషన్ రెడ్డి - Ata NRI Welfare Board
Published : Dec 31, 2023, 10:15 AM IST
Closing Ceremony Of America Telugu Association-Ata In Hyderabad : రాబోయే పాతికేళ్లలో యువత ద్వారా ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో 'అమెరికా తెలుగు సంఘం - (ATA) ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సంఘ సేవకులు, కళాకారులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఆటా జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
ATA Grand Final Celebrations AT Ravindra Bharathi : తనకు గురువు, దైవం అన్నీ ఎన్టీఆరే అని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆ మహానీయుడు పుట్టిన నిమ్మగడ్డలో తాను జన్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఎన్నారై సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. తెలుగు భాషా పరిరక్షణ, భారతీయ సంస్కృతి అభివృద్ధికి ఆటా కృషి చేస్తోందని వక్తలు అభిప్రాయపడ్డారు.