Clashes Between MLA Mynampally and BJYM Followers : రాక్ ల్యాండ్ అవెన్యూ భూ కబ్జా.. ఎమ్మెల్యే మైనంపల్లి, బీజేవైఎం కార్యకర్తల మధ్య గొడవ - రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములు కబ్జా ఇస్యూ
Published : Sep 13, 2023, 4:39 PM IST
Clashes Between MLA Mynampally and BJP Followers : భూములు కబ్జా విషయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేవైఎం కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఈ దాడిలో బీజేవైఎం నాయకులు గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన కొంత మంది వ్యక్తులు సికింద్రాబాద్లోని రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములు కబ్జా చేశారని బీజేవైఎం నాయకులు(BJYM Leaders) ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని.. దీంతోనే ఎమ్మెల్యే భవనాలు కట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం నాయకులను బాధితులు ఆశ్రయించారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలు బీజేవైఎం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
BJYM Leaders Clash in Hyderabad: బీజేవైఎం కార్యకర్తలు కూడా రాక్ల్యాండ్ అవెన్యూ ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం బీజేవైఎం నేతలు జేసీబీతో వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకొని బీజేవైఎం నాయకులపై దాడికి పాల్పడ్డారు. వారు విచక్షణారహితంగా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘర్షణలో పలువురు బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.