తెలంగాణ

telangana

ETV Bharat / videos

టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి.. - మహారాష్ట్ర నాసిక్ న్యూస్

By

Published : Sep 15, 2022, 8:17 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

టోల్‌ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళా సిబ్బందిపై మరో మహిళ దాడికి దిగిన ఘటన మహారాష్ట్రలోని పింపాల్‌గావ్‌ టోల్‌బూత్‌ వద్ద జరిగింది. నిఫాద గ్రామం నుంచి పుణేకు ఓ సీఆర్పీఎఫ్ జవాను కుటుంబంతో కలిసి కారులో వెళుతున్నారు. టోల్‌బూత్‌ వద్ద తాను ఓ జవాను.. అంటూ ఐడీ కార్డు చూయించారు. అంతలోనే జవాను భార్యకు.. మహిళా ఉద్యోగికి మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. అక్కడే ఉన్న టోల్‌బూత్‌ సిబ్బంది ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details