తెలంగాణ

telangana

MLAs Clash

ETV Bharat / videos

Clash Between Congress, BRS MLAs : నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాంగ్రెస్,​ బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల రగడ - ఖమ్మం ఎమ్మెల్యేల మధ్య గొడవ

By

Published : May 10, 2023, 4:03 PM IST

Clash Between Congress, BRS MLAs : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పినపాక ఎమ్మెల్యే రేగా ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ మూడోసారి కేసీఆర్ గెలుస్తారని అనడంతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో  తునికి ఆకు కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇద్దరు ఎమ్మెల్యే వాగ్వాదానికి వేదికైంది. అభివృద్ధి అంశంపై ఇద్దరు నాయకుల మధ్య మాటామాటా పెరిగి, గొడవ తారాస్థాయికి చేరింది. అటు కార్యకర్తలు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. ముఖ్యఅతిథిగా హాజరైన అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం గొడవను సద్దుమణిగేలా చేయకపోవడం గమనార్హం. చివరకు జిల్లా కలెక్టర్,  ఎస్పీ ఇరువర్గాలను అదుపు చేసి శాంతపరిచారు. అనంతరం చెక్కుల పంపిణీ జరిగింది. 

ABOUT THE AUTHOR

...view details