Clash Between Bihar and Telangana Labourers : తెలంగాణ, బిహార్ కూలీ గ్రూపుల మధ్య ఘర్షణ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు - రెండు కూలీ గ్రూపుల మధ్య గొడవ
Published : Sep 28, 2023, 4:05 PM IST
Clash Between Bihar and Telangana Labourers at Yadadri : స్థానిక కూలీలు, స్థానికేతర కూలీలు కర్రలతో దాడులకు దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు రోజుకు రూ.800 నుంచి వెయ్యి రూపాయాల కూలీ తీసుకుంటుండగా.. బిహార్‌కి చెందిన కూలీలు రూ.300 నుంచి రూ.500 మాత్రమే తీసుకుంటున్నారు.
Fight Between Two Labourer Groups in Yadadri : బిహారీల వల్ల తమకు ఎవరు పని చెప్పడం లేదనే కోపంతో స్థానిక కూలీలు ఊగిపోయారు. బిహార్ కూలీలపై దాడి చేయడంతో.. వారు అక్కడి నుంచి పారిపోయారు. బిహార్ కూలీలలో ఒక వ్యక్తిని పట్టుకొని.. స్థానిక కూలీలు రక్తం వచ్చేటట్లు కొట్లారు. స్థానికవ్యక్తి.. బిహార్ వ్యక్తిని పట్టుకుంటే మిగిలిన కూలీలు ఆ వ్యక్తిని కొట్టారు. ఘర్షణల్లో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.