బార్లో గొడవ.. కొట్టుకున్న మందుబాబులు, నిర్వాహకులు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయి లీలా బార్ అండ్ రెస్టారెంట్లో మందుబాబులు వీరంగం సృష్టించారు. బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా ప్రశ్నించినందుకు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పక్కనున్న వారు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి.. బార్ యజమానులతో పాటు మందుబాబులను స్టేషన్కు తరలించారు. ఘర్షణలో ఇద్దరు మందుబాబులకు గాయాలయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST