CIPET: కొలువులకు నెలవుగా మారిన సీపెట్ విద్యాసంస్థ.. ప్లాస్టిక్ రంగంలో వీరే ఇంజినీర్లు - CIPET Course
CIPET Educational Institution: కోర్సు పూర్తవ్వగానే ఏదైనా ఉద్యోగంలో చేరి జీవితంలో త్వరగా స్థిరపడాలని అనుకుంటారు చాలా మంది విద్యార్థులు. అలాంటి వారి కోసం కేంద్రప్రభుత్వం ప్రారంభించిందే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ- సీపెట్. దేశవ్యాప్తంగా ఉన్న 42 సీపెట్ విద్యాసంస్థల్లో కోర్సు పూర్తి చేసిన ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ప్లాస్టిక్ అనుబంధ రంగాల్లో స్థిరపడాలనుకునే వారు పదో తరగతి అర్హతతోనే సీపెట్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందుకు ఏటా అర్హత పరీక్ష నిర్వహిస్తుంది విజయవాడ సూరంపల్లిలోని సీపెట్ విద్యాసంస్థ. మరి సీపెట్‌లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు విధానం ఎలా ఉంటుంది. సూరంపల్లిలోని సీపెట్ విద్యాసంస్థలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మరి సీపెట్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఎలాంటి అర్హతలు అవసరం. సూరంపల్లి సీపెట్‌లో అడ్మిషన్ పొందిన వారికి ఎలాంటి ఫీజుల విధానం ఎలా ఉంటుంది. ప్రాంగణంలో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోఉంటాయి. మూడేళ్లు, రెండేళ్లు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు.. ఏఏ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. 50 ఏళ్లుగా సేవలందిస్తున్న సీపెట్ విద్యాసంస్థల్లో కోర్సు పూర్తి చేసిన వారు ఏఏ దేశాల్లో స్థిరపడ్డారు. ఎలాంటి కోర్సుకు సంబంధించిన మరిన్ని అంశాలను.. సూరంపల్లి సీపెట్ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ చింతా శేఖర్‌ను అడిగి తెలుసుకుందాం.