తెలంగాణ

telangana

Cion Cancer Clinics Founder Sonali Interview

ETV Bharat / videos

బీటెక్​ చేసి, క్యాన్సర్​ బాధితులకు అండగా వైద్య సేవలు అందిస్తున్న మహిళ - సయాన్ క్యాన్సర్ క్లినిక్‌ సోనాలీ ముఖాముఖి

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 6:07 PM IST

Cion Cancer Clinics Founder Sonali Interview : క్యాన్సర్‌ వ్యాధిని ముందే గుర్తిస్తే ముప్పు నుంచి బయటపడొచ్చంటారు వైద్యులు. ఆ ఆలోచనతోనే క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటూ మెరుగైన వైద్యం అందించాలనుకుంది హైదరాబాద్‌కి చెందిన సోనాలీ(Sonali Srungraram). సయాన్ పేరుతో మారుమూల ప్రాంతాల్లోనూ క్యాన్సర్ క్లినిక్‌లను(Cion Cancer Clinics)ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తుంది. అంతే కాకుండా వేల మందికి ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. తన కెరీర్​ను ఉన్నతంగా నిర్మించుకోవాలని బీటెక్​ చేసింది. కానీ, తన కుటుంబ సభ్యులకే క్యాన్సర్​ రావడంతో తన జీవితం మలుపు తిరిగింది. 

తనలాంటి పరిస్థితి మరోకరికి రావొద్దని వినూత్న నిర్ణయం తీసుకుంది సోనాలీ. క్యాన్సర్‌ బాధితులకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వైద్య సేవలతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. తాను క్యాన్సర్ బాధితులకు పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానని తెలిపారు. క్యాన్సర్ క్లినిక్‌ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలు చేస్తున్నానని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు సలహాలు, సూచనలు అందిస్తోన్న సోనాలీతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details