తెలంగాణ

telangana

CID on Margadarsi: సీఐడీ విచారణకు హాజరైన మార్గదర్శి ఫోర్‌మెన్లు

By

Published : Jul 6, 2023, 9:09 AM IST

CID on Margadarsi

CID Interrogated Six Foremen of Margadarsi: మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌కు సంబంధించి ఆరుగురు ఫోర్‌మెన్లను బుధవారం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఈ విచారణకు గుంటూరు అరండల్ పేట, నరసరావుపేట, ఏలూరు, రాజమహేంద్రవరం, సీతంపేట, అనంతపురం బ్రాంచి ఫోర్‌మెన్లు హాజరయ్యారు. అధికారులు నిర్దేశించిన సమయం ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కార్యాలయం లోపలికి వెళ్లిన వారిని రాత్రి 7 గంటలకు విచారణ ముగిసిందని బయటకు పంపించారు. దర్యాప్తు అధికారి డీఎస్పీ రవికుమార్ వారిని విచారించారు. ఒక చందాదారుడికి ఎన్ని చిట్స్ ఉన్నా అతని నుంచి నగదు రూపంలో గరిష్ఠంగా రోజుకు ఎంత స్వీకరిస్తారని అధికారులు ప్రశ్నించగా.. అందుకు ఫోర్‌మెన్లు సమాధానం ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ మొత్తాలు ఏమైనా స్వీకరించారేమో ఒకసారి పరిశీలించి చెప్పాలని తమ వద్ద ఉన్న సమాచార నకలును ఫోర్‌మెన్లకు ఇచ్చారు. ఛైర్మన్‌, ఎండీలతో సంబంధం లేకుండా విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని ఫోర్​మెన్లు రాతపూర్వకంగా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details