Choutuppal Police Seized Drugs : గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్ - విద్యార్థులకు విక్రయిస్తుండగా చేధించిన పోలీసులు
Choutuppal Police Seized Drugs : యాదాద్రి భువనగిరి జిల్లాలో మాదక ద్రవ్యాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట వద్ద పోలీసులు పట్టుకున్నారని డీసీపీ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు లహరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేశ్‌చంద్ర చెప్పారు. రూ.92 వేల విలువ గల బ్లూ కలర్డ్ ఎండీఏంఏ పిల్స్ డ్రగ్, కొకెైన్, సింథటిక్ డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
'చౌటుప్పల్ పోలీసులు ప్రధానమైన డ్రగ్ మాఫియాను ఛేదించారు. వారిలో గోవాకు చెందిన ప్రధాన వ్యక్తి సయాన్ లహరి. ఇతను గోవా నుంచే డ్రగ్స్ మాఫియాను ఆపరేట్ చేస్తుంటాడు. ఇప్పుడు అతని నుంచి సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. వేరే రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియాను ఆపరేట్ చేస్తున్న స్పెన్సర్ దగ్గర సయాన్ లహరి ఉండి మాఫియాను ఆపరేట్ చేస్తున్నాడు. చౌటుప్పల్ దగ్గరలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ డ్రగ్స్‌ను విక్రయించే ప్రయత్నం చేశాడు. గత మూడు సంవత్సరాలుగా ఈ డ్రగ్ మాఫియా నడుస్తోంది. ఎడ్విన్ అరెస్టు తర్వాత వీరి నెట్వర్క్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. వీరు డ్రగ్స్‌ను అమాయక ప్రజలకు, విద్యార్థులకు విక్రయించడం, బ్లాక్మెయిల్ చేయటం లాంటివి చేసేవారు. ప్రస్తుతం చౌటుప్పల్ ప్రాంతంలో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించే క్రమంలో దొరికారు' అని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్‌చంద్ర తెలిపారు.