తెలంగాణ

telangana

Chotu Start Up Company Founder Vamsi Interview

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 7:44 PM IST

ETV Bharat / videos

చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్న 'చోటు' - అంతా వాట్సాప్‌లోనే

Chotu Start Up Company Founder Vamsi Interview: ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివాడు. చదువు పూర్తవగానే ఉద్యోగాలు చేశాడు. కానీ, ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. కొత్తదనాన్ని కోరుకుంటున్న సమయంలో స్టార్టప్‌ ఆలోచన మనసులో మెదిలింది. అందులోనూ చాలా రంగాలపై అవగాహన పెంచుకున్నాడు. అప్పుడే చిరువ్యాపారుల కోసం ఏదైనా చేయాలని అన్వేషణ ప్రారంభమైంది. అందులోంచి పుట్టిందే "చోటు"(Chotu). దేశంలోని ప్రతి వ్యాపారస్తుని బలోపేతం చేస్తూ డిజిటలైజ్‌ చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నారు. 

Chotu Founder Vamsi Interview: చిన్న అంకుర సంస్థగా మొదలై చిరువ్యాపారులు, వినియోగదారుల మన్ననలు పొందుతోంది. వినియోగదారునికి కావాల్సిన కూరగాయలు, కేక్స్, కిరాణా సరుకులు తదితర వస్తువులు ఏవైనా సరే వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకోవచ్చని చోటు నిర్వహకులు చెబుతున్నారు. కొవిడ్‌ సమయంలో చాలా సమస్యలు ఎదురైయ్యాయని, దీంతో పాటు సాప్ట్‌వేర్ సృష్టించేందుకు కూడా ఇబ్బంది పడ్డామని తెలుపుతున్నారు. అసలేంటీ చోటు? అదేలా పనిచేస్తుందో చెబుతున్న "చోటు" కో ఫౌండర్‌ వంశీ పంజాలతో ఈటీవీ భారత్ చిట్‌చాట్‌.

ABOUT THE AUTHOR

...view details