తెలంగాణ

telangana

చిన్నజీయర్‌ స్వామీజీ

ETV Bharat / videos

సంకల్ప బలంతో కష్టపడితే ఏదైనా సాధించగలం: చినజీయర్‌ స్వామి - చిన్న జీయర్ స్వామీజీ

By

Published : Mar 26, 2023, 2:42 PM IST

Updated : Mar 26, 2023, 3:41 PM IST

Chinnajeeyar Swamy at the Annual Day celebrations of JB education Group: సంకల్ప బలంతో కష్టపడితే ఏదైనా సాధించగలుగుతామని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జేబి గ్రూప్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆన్యువల్ డే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బి వి మోహన్​రెడ్డి, హైకోర్టు ఛైర్మన్ జస్టిస్ ఏ గోపాల్​రెడ్డిలు హాజరయ్యారు. జేబీ గ్రూప్ సెక్రటరీ కృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అందరి విద్యార్థులలో ప్రతిభ ఉందని.. అది వెలికి తీసే బాధ్యత అధ్యాపకులపైనే ఉంటుందని గుర్తు చేశారు. 

కష్టంతో, ఒక సంకల్ప బలంతో ముందుకు సాగిన భాస్కరరావు అతిపెద్ద సంస్థలను అభివృద్ధిపరిచి లక్షల మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారని.. కష్టపడితేనే లక్ష్యానికి చేరుకుంటామని కచ్చితమైన నిర్ణయంతో ఏ పని చేసినా లక్ష్యానికి చేరుకుంటామని పేర్కొన్నారు. సంస్థలు స్థిరంగా ఏర్పాటు చేయగలిగారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు వంశీధర్ రావు, దీపిక, గాయత్రి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

Last Updated : Mar 26, 2023, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details