తెలంగాణ

telangana

dog

ETV Bharat / videos

Dog: మానవత్వం చాటుకున్న చిన్నారులు.. శునకాన్ని కాపాడిన వీడియో వైరల్ - Hyderabad latest news

By

Published : May 3, 2023, 10:58 PM IST

Children rescue the dog from floods in nacharam: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సాటి మనుషులే కష్టాల్లో ఉన్నారంటే పట్టించుకోని ఈ రోజుల్లో.. ఆ చిన్నారులు చేసిన పని చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపిస్తోంది. తమ కళ్ల ముందు ప్రమాదంలో చిక్కుక్కున్న ఓ జీవి ప్రాణాలు కాపాడారు ఆ బాలలు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కుక్క కాటుకు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, గాయాలపాలవుతున్నారని తరచుగా వార్తలు వింటున్నాం.. కానీ ఆ కుక్కల పట్లనే ఈ చిన్నారులు తమ మానవత్వం చాటారు. 

తమకు ఎమైనా హాని చేస్తుందేమోనని భయపడకుండా ఆ మూగజంతువును రక్షించారు. హైదరాబాద్​లో భారీగా వర్షం కురవడంతో వర్షపు నీటితో అధికంగా ప్రవహిస్తున్న నాలాలో ఇరుక్కుపోయిన ఓ కుక్కను సిద్దూ, చరణ్‌ అనే ఇద్దరు బాలురు కాపాడి బయటకు తీసుకు వచ్చారు. చిన్నారులు చేసిన సాహసాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. నాచారంలోని ఎర్రగుంట కల్లు కాంపౌండ్‌ సమీపంలోని నాలా వద్ద జరిగిన దృశ్యం వైరల్‌గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details