వడాపావ్లు చేస్తుండగా యువకుడికి గుండెపోటు అక్కడికక్కడే మృతి - vadapav chef died
మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో మాదా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రాజస్థానీ హోటల్లో వడాపావ్లు తయారు చేస్తూనే మృతి చెందాడు ఓ చెఫ్. అక్టోబర్ 24న వడాపావ్లు తయారు చేస్తున్న సమయంలో ప్రకాశ్ నానురామ్ అనే యువకుడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST