తెలంగాణ

telangana

Cheetah In Hotel Room Viral Video

ETV Bharat / videos

హోటల్​ గదిలో చిరుత బీభత్సం- 2గంటలు అక్కడే మకాం- చివరకు ఏమైందంటే? - రాజస్థాన్​ జైపుర్​లో చిరుత కలకలం

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:31 PM IST

Cheetah In Hotel Room In Jaipur : రాజస్థాన్​ జైపుర్​ కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో గురువారం ఉదయం ఓ చిరుత బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా హోటల్​ గదిలోకి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్న​ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీంతో వెంటనే వారు చిరుత ఉన్న గదికి బయట నుంచి తాళం వేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆ చిరుత రూంలోనే గడిపింది. ఈ దృశ్యాలన్నింటినీ హోటల్​ పనిచేస్తున్న వ్యక్తి, తన ఫోన్​లో బంధించాడు. అనంతరం దీనిపై అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చింది హోటల్​ యాజమాన్యం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి దానిని నహర్‌ఘర్​ బయోలాజికల్ పార్కులో విడిచిపెట్టారు. చిరుత ప్రవేశించిన గదిలో ఉంటున్న టూరిస్టు బయటకు వెళ్లడం వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది. కాగా, హోటల్​లోకి చిరుత ప్రవేశించిందని తెలుసుకున్న మిగతా టూరిస్టులు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details