తెలంగాణ

telangana

చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వీడియో

ETV Bharat / videos

Chandrayaan 3 Soft Landing : ల్యాండర్​ అడుగుపెడుతున్నప్పుడు చంద్రుడిని చూశారా? - చంద్రునిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 10:24 PM IST

Updated : Aug 25, 2023, 6:15 AM IST

Chandrayaan 3 Soft Landing Video :చంద్రయాన్ 3​ ప్రయోగానికి సంబంధించి మరో వీడియోను విడుదల చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్‌ చేసింది. చంద్రుడిపై ల్యాండర్‌ దిగడానికి కొన్ని కి.మీల ముందు మొదలైన ఈ వీడియో.. చంద్రుడిపై అడుగుపెట్టేవరకు రికార్డయింది. ఇప్పటివరకు ల్యాండర్‌ 'విక్రమ్‌' తీసిన కొన్ని ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. 'అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా జాబిల్లి చిత్రాన్ని ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి' అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఇస్రో తాజాగా షేర్‌ చేసింది.

అంతకుముందు.. ల్యాండర్​ చండ్రుడిపై కాలుమోపిన అనంతరం ప్రగ్యాన్ రోవర్​ బయటకు వచ్చి తన పనిని సాఫీగా చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుందని వెల్లడించింది. కాగా చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. జులై 14న షార్​ నుంచి చంద్రయాన్​-3 ప్రయోగం జరిగింది. అనంతరం 41 రోజులు ప్రయాణించి చంద్రుడిపై దిగింది విక్రమ్​ ల్యాండర్​​. జాబిలిపై విజయవంతంగా అడుగు పెట్టి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఇస్రో.

Last Updated : Aug 25, 2023, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details