Chandrababu Warning: "జగన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి"
Chandrababu Warning to YSRCP Leaders: జగన్ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎక్స్పైరీ డేట్ అయ్యాక ఏ మందు వాడాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలని హితవుపలికారు. అలాగే ఎగిరెగిరి పడుతున్న వైఎస్సార్సీపీ నేతల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు ఓడిపోతామనే.. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తాను చెప్పే ప్రతి మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని, రైతు నాశనమయ్యాడని అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిలో రైతుల భూమిని వేరొకరికి దానం చేసిన జగన్మోహన్ రెడ్డి దానకర్ణుడా అంటూ నిలదీశారు. అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా అంటూ నిలదీశారు. అమరావతి ప్రజా రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ రాజధాని ఏదీ అంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులపై జగన్కు ఎందుకు కక్ష అంటూ ప్రశ్నించారు.