Chandrababu Suffered Dehydration in Jail: జైల్లో చంద్రబాబుకు డీహైడ్రేషన్.. కుటుంబ సభ్యుల ఆందోళన - వైసీపీ ఆన్ చంద్రబాబు అరెస్ట్
Published : Oct 10, 2023, 10:24 PM IST
Chandrababu Suffered Dehydration in Jail: రాజమండ్రి కేంద్ర కారాగారం లో చంద్రబాబుకు తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా రాజమండ్రిలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల (Temperature Fluctuations) కారణంగా తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. చంద్రబాబు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. తాను డీ హైడ్రేషన్ (Dehydration) కు గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను నేడు చంద్రబాబు కుటుంబ సభ్యులతో జరిగిన ములాఖత్‌లో సందర్భంగా వారితో పంచుకున్నారు.
చంద్రబాబు (Chandrababu) ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్యం పై టీడీపీ(TDP) శ్రేణులు... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేకపోతే రాబోయే రోజుల్లో వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ(YCP) కోసం పనిచేసే అధికారులు త్వరలో జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించారు.