Chandrababu Naidu Shifting To Rajahmundry Central Jail కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్.. రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు తరలింపు - చంద్రబాబు ఏసీబీ కోర్టు లో వీడియోలు
Published : Sep 10, 2023, 10:44 PM IST
|Updated : Sep 11, 2023, 6:28 AM IST
Chandrababu Naidu Shifting to Rajahmundry Central Jail:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు(Rajahmundry Central Jail) తరలింస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా హెలిక్యాప్టర్ ద్వారా చంద్రబాబును రాజమహేంద్రవరం తరలిస్తారని మెుదట ప్రచారం జరిగింది. అయితే, రాత్రి 9.30 గంటలకు రోడ్డు మార్గంలోనే భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. అక్కడే టీడీపీ నేతలకూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ రాజమహేంద్రవరం చేరుకోనుంది.
ప్రత్యేక సౌకర్యాలు: తన వయసు, అనారోగ్య పరిస్థితి దృష్ట్యా జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు(Chandrababu) ఏసీబీ కోర్టును కోరారు. చంద్రబాబు ఆహారం, వసతి, ఇతర ఏర్పాట్లకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. ఇప్పటికే చంద్రబాబును కస్టడీకి కోరుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌ను రేపు విచారించే అవకాశం ఉంది.