నారావారిపల్లెలో సందడిగా సంక్రాంతి సంబురాలు - SANKRANTHI IN HOMETOWN NARAVARIPALLI
SANKRANTHI CELEBRATED IN NARAVARIPALLI ఏపీలోని నారావారిపల్లెలో నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి వచ్చి సందడి చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ.. ఆటపాటలతో సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు. ప్రేక్షక దేవుళ్లు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ అని ఆయన అన్నారు. సంక్రాంతి పండగ సొంతూళ్లో చేసుకుంటే పిల్లలకూ మన సంస్కృతీ సంప్రదాయలు తెలుస్తాయన్నారు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి. నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పిల్లలతో కలిసి రంగవల్లులు పరిశీలించి విజేతలను ప్రకటించారు.