తెలంగాణ

telangana

Chandrababu Bail Petition Transferred to Vacation Bench

ETV Bharat / videos

Chandrababu Bail Petition Transferred to Vacation Bench: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ - వైసీపీ ఆన్ టీడీపీ

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 4:49 PM IST

Chandrababu Bail Petition Transferred to Vacation Bench: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు (Chandrababu) తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అందుకు.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ రెడ్డి అంగీకరించారు. బెయిల్‌ పిటిషన్‌ (Bail Petition)పై దసరా సెలవుల్లో విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరఫన లాయర్లు ఐఏ పిటిషన్ దాఖలు చేశారు. ఐఏ పిటిషన్‌పైనా వెకేషన్ బెంచ్‌ విచారణ చేస్తుందని.. జస్టిస్‌ సురేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సంబంధించిన నివేదికను వెకేషన్ బెంచ్‌కు ఇవ్వాలనీ.. రాజమండ్రి జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్‌ (Vacation Bench)లో విచారణ  చేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.   

ABOUT THE AUTHOR

...view details