LIngayat Rally in Telangana : లింగాయత్ సమాజ్ డిమాండ్‌పై కేంద్ర మంత్రుల రియాక్షన్ ఇదే
Central Ministers Lingayath meeting :బీసీ డీ నుంచి ఓబీసీలోకి చేర్చాలన్న లింగాయత్ సమాజ్ డిమాండ్‌పై.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవత్ గురుబసపప్పా ఖుభా స్పందించారు. దీనితో పాటు పలు డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి.. నెరవేర్చేందుకు కృషి చేస్తామని మంత్రులు లింగాయత్ సమాజ్ నాయకులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో లింగాయత్ సమన్వయ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో.. లింగాయత్ మహా ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... కేంద్ర మంత్రులు భగవత్ గురుబసపప్పా ఖుభా, కిషన్ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గురువులు, లింగాయత్ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
లింగాయత్ సమాజం ఆధ్యాత్మిక సమాజం, గొప్ప సమాజమని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణలో ఐక్యంగా ఉండి.. రాజకీయంగా ఎదగాలని సూచించారు. లింగాయత్ ల సమస్యల సాధన కోసం కేంద్ర సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లింగాయతులంతా బసవేశ్వర వారసులని... లింగాయత్ సమాజ్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని... రాజ్యసభ సభ్యులు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.