తెలంగాణ

telangana

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినందుకు బాధపడుతున్న : నితిన్‌ గడ్కరీ

ETV Bharat / videos

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినందుకు బాధపడుతున్నా : నితిన్‌ గడ్కరీ - కామారెడ్డిలో బీజేపీ ఎన్నికల ప్రచారం

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 9:23 PM IST

Central Minister Nitin Gadkari Comments on BRS Government : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ తేదీ సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచార జోరును ముమ్మరం చేస్తోంది. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. సభలో పాల్గొన్న ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని.. అందుకు ఇవాళ బాధపడుతున్నట్లు.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ సొంత డిజైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి.. రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే.. మరింత అభివృద్ధి చెందుతుందని.. ఈ క్రమంలోనే జాతీయ రహదారులను వేలకోట్లు ఖర్చుచేసి నిర్మించామని తెలిపారు. అన్ని వర్గాలకు.. సకలజనులకు సమాన న్యాయం జరగాలంటే.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని.. గడ్కరీ ఆకాంక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి హైవేపై ప్రయాణంలా దూసుకుపోతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details