గులాబీ నేతలకు ఒకే రోజు రెండు పండగలు.. కేసీఆర్ ప్రకటనతో అంబరాన్ని అంటుతున్న సంబరాలు - తెలంగాణ తాజా రాజకీయ సమాచారం
Celebrations of TRS leaders in Nizamabad: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతో నిజామాబాద్ జిల్లాల్లో సందడి నెలకొంది. తెరాస కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. జాతీయ పార్టీకి కేసీఆర్ ఆమోదం తెలిపిన మరుక్షణం నుంచే కార్యకర్తలు టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకుని రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో భారీ కేసీఆర్ చిత్ర పటాన్ని చిత్రీకరించారు. హైదరాబాద్కు చెందిన కళాకారుడు 10 గంటల పాటు శ్రమించి చిత్ర పటాన్ని గీశారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST