తెలంగాణ

telangana

CBN_Lawyer_Mentioned_Chandrababu_Quash_Petition_in_Supreme_Court

ETV Bharat / videos

CBN Lawyer Mentioned Chandrababu Quash Petition in Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన న్యాయవాది - చంద్రబాబును సీఐడీ అరెస్టు

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 1:48 PM IST

CBN Lawyer Mentioned Chandrababu Quash Petition in Supreme Court:  స్కిల్‌ డెవలప్​మెంట్​లో సీఐడీ నమోదు చేసిన కేసుపై క్వాష్‌ పిటిషన్‌ను.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేశారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని.. న్యాయవాది సిద్దార్ధ లూథ్రా న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ ఎన్నిరోజుల నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని అడిగారు. ఈనెల 8న చంద్రబాబును అరెస్టు చేశారని సిద్దార్ధ లూథ్రా.. సీజేఐకి వివరించారు. క్వాష్‌ పిటిషన్‌పై రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదికి సీజేఐ సూచించారు. 

స్కిల్​ కేసులో ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. ఆయన జ్యూడిషియల్​ కస్టడీలో ఉన్నారు. అయితే అందులో గత రెండు రోజులుగా సీఐడీ కస్టడీలో ఉండగా.. చంద్రబాబును సీఐడీ కస్టడీపై ఆన్​లైన్​ ద్వారా ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో చంద్రబాబు రిమాండ్​ పొడిగించాలని సీఐడీ కోరింది. దీంతో పిటిషన్​ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు సీఐడీకి సూచించింది. 

ABOUT THE AUTHOR

...view details