సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ - మరో తేదీ ఇస్తామన్న న్యాయమూర్తి - స్కిల్‌కేసు
Published : Jan 17, 2024, 5:35 PM IST
CBN Fibernet case : స్కిల్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ్టి కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి ధర్మాసనం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనగా విచారణే జరగలేదు.
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగు దేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. ఈ మధ్యాహ్నం చంద్రబాబు పిటిషన్ జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు రావాల్సి ఉంది. అయితే ఈ సమయానికి పిటిషన్ విచారణకు రాకపోవడంతో జస్టిస్ బోస్ వద్ద ఏపీ ప్రభుత్వ న్యాయవాది చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్ ప్రస్తావన చేశారు. అయితే ఇవాళ బెంచ్ కూర్చోవడం లేదని, మరో తేదీ ఇస్తామని జస్టిస్ బోస్ తెలిపారు.
ఈ పిటిషన్ విచారణ అంశాలు సెక్షన్ 17Aతో ముడిపడి ఉన్నందున గతంలో కేసు విచారణను బెంచ్ వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. అయితే, స్కిల్‌కేసులో సెక్షన్ 17Aపై ధర్మాసనం నిన్న భిన్నమైన తీర్పులు వెలువరించిన వేళ ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి ధర్మాసనం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.