తెలంగాణ

telangana

Chikoti Praveen

Chikoti Praveen: 'రాజకీయాల్లోకి వస్తున్నానన్న వదంతులతో నన్ను టార్గెట్‌ చేస్తున్నారు'

By

Published : May 4, 2023, 2:34 PM IST

Published : May 4, 2023, 2:34 PM IST

Chikoti Praveen Latest News: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ఈ నెల 1న థాయ్​లాండ్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా పోలీసులకు చిక్కారు. థాయ్​లాండ్​లో గ్యాంబ్లింగ్​కు పాల్పడుతున్నారని పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా చీకోటి ప్రవీణ్ దీనిపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా లీగల్‌గా క్యాసినో నడిపే స్థలాలున్నాయని చీకోటి వెల్లడించారు. కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్‌కు న్యాయపరంగా అనుమతులు ఉన్నాయని తెలిపారు.

థాయ్‌లాండ్‌కు ఓ ప్లేయర్‌లాగా ఈవెంట్‌కు వెళ్లినట్లు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. అక్కడ పోకర్‌ ఇల్లీగల్ అని తనకు తెలియదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే వదంతుల వల్లే ఆయనను టార్గెట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు సంబంధించి.. వివరణతో కూడిన వీడియోను విడుదల చేశారు. పోలీసులు దాడి చేసినప్పుడు తాను తప్పించుకోవడానికి రూ.50 లక్షలు ఇచ్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఆ ఈవెంట్‌కు ఆర్గనైజర్‌ను కాదని తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కోర్టుకు 200 బర్త్‌ థాయ్‌ కరెన్సీ మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. దేవ్, సీత అనే వారు ఆహ్వానం పంపి.. ఆ టోర్నమెంట్‌ లీగల్‌ అని చెప్పడంతోనే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details